సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి
నమస్తే భారత్ :-తొర్రూరు
ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని, విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని డిఎంహెచ్వో డాక్టర్ రవి రాథోడ్, ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పి. సుగుణాకర్ రాజు లు పిలుపునిచ్చారు.తొర్రూరు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ చెప్యాల వనాకర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. వైద్యులు, ఆరోగ్య.సిబ్బంది.స్థానికులు.శాలువాలు,పూలమాలలతో వనాకర్ రెడ్డి, రూపకల్పన దంపతులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా రవిరాథోడ్, సుగుణాకర్ రాజులు మాట్లాడుతూ పదవి విరమణ ఉద్యోగానికి మాత్రమేనని శేష జీవితం కుటుంబంతో గడిపేందుకు, సామాజిక సేవకు అంకితం చేయాలని కోరారు. వనాకర్ రెడ్డి అంకితభావం గల ఉద్యోగి అని, విధి నిర్వహణలో క్రమశిక్షణగా మెలిగేవాడని తెలిపారు. ఉద్యోగ ధర్మాన్ని మూడు దశాబ్దాలకు పైగా త్రికరణ శుద్ధితో నిర్వహించారని గుర్తు చేశారు. అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులను ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు. పారా మెడికల్ ఆఫీసర్ గా అంకితభావంతో పనిచేశాడని, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేశాడని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జ్వలిత, డాక్టర్ నందనా దేవి, డాక్టర్ మానస, డాక్టర్ ప్రియాంక, వైద్యులు డాక్టర్ గిరి ప్రసాద్, డాక్టర్ అనిల్ కుమార్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.