NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 3:19 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడలో నూతనంగా సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభించిన

మరిపెడలో నూతనంగా సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభించిన

జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి,

సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని అంగడి సెంటర్‌లో మహేందర్ నూతనంగా ఏర్పాటు చేసిన సంపూర్ణ అమృతుల్య టీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెండ్లి రఘువీరా రెడ్డితో కలిసి టీ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన టీ సెంటర్ నిర్వాహకుడు మహేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్థానికంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, వ్యాపార రంగం అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ రవి నాయక్, కొంపెల్లి సురేందర్ రెడ్డి, షేక్ అఫ్జల్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.