నూతనంగా మహబూబాబాద్ జిల్లా మిషన్ భగీరథ కార్మిక సంఘం
శానం ఉపేందర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మిషన్ భగీరథ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌరవనీయ కమిటీ సభ్యులకు, జిల్లా నాయకత్వానికి, అలాగే అన్ని మండలాల నా తోటి కార్మిక మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.తెలియజేస్తున్నాను.నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసం మరియు బాధ్యతను పూర్తిగా గుర్తించి, కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల పరిష్కారం మరియు సంఘ బలోపేతం కోసం అంకితభావంతో పని చేస్తానని హామీ ఇస్తున్నాను.
మనందరం ఐక్యంగా ముందుకు సాగి, మిషన్ భగీరథ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు పోరాట పథంలో కలిసి నడుద్దాం.కార్మిక ఐక్యతే మన బలం – సంఘటిత పోరాటమే మన విజయం.మనం చేయబోయే అన్ని కార్యక్రమాలకు మీరందరూ పూర్తి మద్దతుగా నిలబడాలి