NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:48 pm Posted by : NAMASTHE BHARAT

సాయిబాబా నగర్‌లో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం

సాయిబాబా నగర్‌లో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు కేంద్రాలుగా మారాలి

కార్యకర్తలే పార్టీ బలోపేతానికి వెన్నెముక: హన్మంత్ రెడ్డి

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని నాయకులకు సూచన

నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపు

భారీ సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే భారత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 292 డివిజన్ సాయిబాబా నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరి కిరణ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కేవలం రాజకీయ కార్యక్రమాల నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసే సేవా కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.