NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 9:35 am Posted by : NAMASTHE BHARAT

కొత్త సీసీ రోడ్డుతో పద్మానగర్‌కు కొత్త ఊపు.. ఎమ్మెల్యే వివేకానందకు కాలనీవాసుల కృతజ్ఞతలు

కొత్త సీసీ రోడ్డుతో పద్మానగర్‌కు కొత్త ఊపు.. ఎమ్మెల్యే వివేకానందకు కాలనీవాసుల కృతజ్ఞతలు

-రోడ్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానించిన కాలనీ ప్రతినిధులు

-పద్మానగర్ ఫేజ్–2 రోడ్ నెం.24లో పూర్తైన సీసీ రోడ్డు నిర్మాణం

-ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఎమ్మెల్యే వివేకానంద అని ప్రశంసలు

-కాలనీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని వినతి

కుత్బుల్లాపూర్, జూలై 4 ( నమస్తే భరత్ )
కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్–2, రోడ్ నెం.24లో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి రోడ్డు నిర్మాణానికి సహకరించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానందను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అలాగే నూతన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని కాలనీవాసులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్, కాలనీ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, యువ నాయకుడు శౌరి రాజ్, కేదార్‌నాథ్ గడ్డలే, రామదాస్, దశరథ్‌తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను వారు కోరారు. కొత్త సీసీ రోడ్డు నిర్మాణంతో రాకపోకలు సులభతరమవడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగిపోయాయని కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.