ప్రకృతి వైద్యమే మానవాళికి
మనుగడ
కెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం
వరంగల్ జూలై9 ( నమస్తే భారత్ ) :
ప్రకృతి వైద్యమే మానవాళి ఆరోగ్యకరమైన మనుగడ సాగించవచ్చునని కెయూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు.కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్రం అలిమ్నీ హాల్లో గురువారం విద్యా వైద్యం అవగాహన సదస్సు డాక్టర్ సంకినేని వెంకట్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కెయూయూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి సహకరిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ప్రకృతిలో ఉండే అన్ని రకాల సౌకర్యాలను ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
ఈ సమావేశానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రాకృతిక వైద్యులు డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూఈ దేశంలో చాలామంది ప్రకృతి యొక్క గొప్పతనం తెలియక ఫార్మసిటికల్ మందుల కోసం అనేక డబ్బులు వెచ్చించి ఈరోజు ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. ఏవ్యాధి వచ్చినా కూడా ఆ వ్యాధిని నయం చేయడానికి ప్రకృతిలోనే అనేక రకాలుగా మెడిసిన్ లభిస్తుందని, ఆ విషయం అర్థం కాక అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పటల్ కి వెళ్లి ఆర్థికంగా నష్ట పోతున్నారన్నారు. ప్రకృతి వైద్యం మీద అవగాహన పెంచుకొని ప్రతిరోజు మన జీవన విధానాన్ని క్రమ పద్ధతిలో నడుచుకోని అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉంటుందని ఎవరికీ జబ్బు వస్తే కారణం వారేనని అందుకే జబ్బు రాకుండా జాగ్రత్త పడటానికి ప్రకృతితో సహజీవనం చేయాలన్నారు. చెట్ల ఆకులు మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగ పడతాయో అవగాహన కల్పించుకొని ప్రకృతిలోనే వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు మన వంటింట్లోనే మన రోగాలు నయం చేసే వివిధ రకాలైన మెడిసిన్స్ కూరలో వేసే దినుసులు ఉన్నాయని వాటిని మరిచిపోయి మనం డాక్టర్ల వైపు పరుగులు తీస్తున్నామన్నారు. ప్రాకృతిక వైద్యం మీద అవగాహన పెంచుకొని మీ జీవితాలను మీరే కాపాడుకోవాలని తెలియజేశారు. భవిష్యత్తులో జీవన ప్రమాణం కూడా తగ్గిపోతుందని 50 సంవత్సరాలకు ఎక్కువ బతికే పరిస్థితి లేదని 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి షుగర్, బీపీ వ్యాధుల బారిన పడుతున్నారని వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల మొక్కలే ముఖ్య పాత్ర వహిస్తాయి. అందువల్ల ప్రకృతిని కాపాడుకుంటూనే ఆ ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుకోడానికి మనం సిద్ధంగా ఉండాలని విద్య వైద్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి భవిష్యత్ తరాలకు మనం దిక్సూచిగా నిలిచి ఉండాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో డాక్టర్ గడ్డం కృష్ణయ్య రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, డాక్టర్ వడ్లకొండ సత్యనారాయణ డైరెక్టర్ పివి నాలెడ్జి సెంటర్ , డాక్టర్ మామిడి లింగయ్య విభాగ అధిపతి తెలుగు, డాక్టర్ చిర్ర రాజు పాలకమండ సభ్యులు కేయూ, డాక్టర్ నాగరాజు , డిఐపిఎస్ ఏ అధ్యక్షులు డాక్టర్ రాధిక , బొడ్డు దయాకర్ ,సామాజిక కార్యకర్త , అంకిల శంకర్ , రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ కల్లేపల్లి ప్రశాంత్ , అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.