జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి
విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలి

200 రోజులు పని దినాలు పెంచాలి రూ 800 వేతనం ఇవ్వాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న,మండల ఉపాధ్యక్షులు గుండ గాని మధుసూదన్
నమస్తే భారత్ :-మరిపెడ
జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించి విబి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని 200 రోజులు పని దినాలు పెంచి రూ 800 వేతనం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు గుండ గాని మధుసూదన్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అక్టోబర్ 2 మండల మండలం గుండెపూడి మహాత్మా గాంధీ విగ్రహం ముందు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం, తెలంగాణ గొర్రెల మేకల పెంపకదారుల సంఘం, సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ తెలంగాణ, ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మధు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ 2005 చట్టాన్ని రద్దుచేసి వి బి జి రామ్ జి పథకాన్ని తీసుకురావడం వ్యవసాయ కార్మికులకు తీరని ద్రోహం బిజెపి ప్రభుత్వం చేసింది అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించి 200 రోజులు పని దినాలు పెంచి రూ 800 వేతనం ఇవ్వాలని మునిసిపాలిటీలోని పేదలకు ఉపాధి పనులు కల్పించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కార్మికులకు 12000 ఇవ్వాలని అంబేద్కర్ అభయ హస్తం, దళిత గిరిజనులకు 12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు,లేని పక్షంలో ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో.ఆవాస్ సంగం మండల నాయకులు Sk షరీఫ్ రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు అల్లి శ్రీనివాస్ రెడ్డి జీఎంపీస్ సంగం నాయకులు బింగి మహేష్, వల్లవుల కొమర మల్లు సిఐటియు గ్రామ ఉపాధ్యక్షులు మిట్ట కోలు రంగయ్య తదితరులు పాల్గొన్నారు