పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించిన మున్సిపల్ చైర్పర్సన్
పాల్వంచ పెద్దమ్మ తల్లిని దర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ నమస్తే భారత్:-మరిపెడ పాల్వంచలోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఆదివారం మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు...