NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:39 pm Posted by : NAMASTHE BHARAT

మండల స్థాయి క్రీడా సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

మండల స్థాయి క్రీడా సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

 

నమస్తే భారత్ :-మరిపెడ

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉన్నత పాఠశాల విద్యార్థుల కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ సెలక్షన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి క్రీడా జ్యోతి వెలిగించి, పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీయడంతో పాటు, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ.లక్షణాలను.పెంపొందించడంలో క్రీడలు ఎంతో కీలకమని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత మెరుగ్గా రాణించాలని కోరారు.అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, వివిధ జట్ల మధ్య జరుగుతున్న పోటీలను పరిశీలించారు. విద్యార్థులను ఉత్సాహపరిచి, క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనంతరావు, రామ్మోహన్, రాజకుమారి, శ్రీనివాస్, రమా, రాంబాబు, నరేందర్, శ్రీకాంత్, నర్మద, రవి, ప్రభు, సునీత, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.