*బస్టాండ్ లో పల్స్ పోలియో ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు*
నమస్తే భరత్, 28/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మక్తల్ బస్టాండ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహకారంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి… పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కట్టా సురేష్ గుప్తా
డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ సిద్ధప్ప, కర్నే పీహెచ్ సి డాక్టర్ తిరుపతి, వైద్య సిబ్బంది శ్రీధర్, యాదగిరి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.