NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 10:05 pm Posted by : NAMASTHE BHARAT

నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు

నిబంధనలకు విరుద్ధంగా
బహుళ అంతస్తుల నిర్మాణాలు

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వైనం

సిపిఐ మండల కార్యదర్శి నర్రగిరి

నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 16, పురపాలక పరిధిలోని ఇలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని వీటి పై చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి నర్రాగిరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం నాయకులు మాట్లాడుతూ పురపాలక పరిధి, శివారు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు లేనప్పటికీ జీవో నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున బహులంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన అన్నారు. సాయి బాలాజీ కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తు అపార్ట్మెంట్ కట్టి ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను సిపిఐ మండల కార్యదర్శి నర్రాగిరి డిమాండ్ చేశారు.
పట్టణం నడిబొడ్డున శివారులలో ఇంతటి దుర్మార్గమైన వ్యాపారం జరుగుతుంటే జిహెచ్ఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.అక్రమ నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నర్రాగిరి అధికారులకు తెలిపారు.