NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 10:17 pm Posted by : NAMASTHE BHARAT

వీవో భవన నిర్మాణ పనుల పరిశీలించిన ఎంపీడీవో అద్వైత

వీవో భవన నిర్మాణ పనుల పరిశీలించిన ఎంపీడీవో అద్వైత

ఖానాపురం నవంబర్ 5 (మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న వీవో భవన నిర్మాణ పనుల పురోగతిని ఎంపీడీవో వి. అద్వైత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనూష, పంచాయతీ కార్యదర్శి అబేదా, వీఓఏ పద్మ, ఫీల్డ్ అసిస్టెంట్ బాబులతో మాట్లాడి వీవో భవనం సమీపంలో శానిటరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు.అనంతరం ఉపాధిహామీ పనుల పురోగతి, కూలీల సమీకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి, కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం మనుబోతులగడ్డ, బండమీది మామిడితండా గ్రామపంచాయతీల పరిధిలోని మూడు ప్రాంతాల్లో బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాల ఏర్పాటుకు స్థల పరిశీలన నిర్వహించి మార్కింగ్‌లు చేపట్టారు.భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ లక్ష్యంగా బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలని ఎంపీడీవో సూచించారు. ఉపాధిహామీ పనుల ద్వారా కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు శ్రీలత, రమేష్, ఆర్ డబ్ల్యుఏస్ ఏఈ ప్రభావతి, ఈసీ అరుణ్ కుమార్, టీఏరవి తదితరులు పాల్గొన్నారు.