ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-పాలకుర్తి పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి పట్టణ మహిళలతో కలిసి పాల్గొన్న పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. ప్రకృతిని పూజిస్తూ, పూలను ఆరాధిస్తూ మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ మన రాష్ట్ర ప్రత్యేకతను చాటిచెబుతుంది....