NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 2:53 pm Posted by : NAMASTHE BHARAT

ఎల్‌బీ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

ఎల్‌బీ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి

నమస్తే భారత్ :-పెద్దవంగర

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం ఎల్‌బీ తండా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పాలకుర్తి శాసన సభ్యురాలు.యశశ్విని రెడ్డి శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణం మరియు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు మరింత మెరుగైన వాతావరణం కల్పించబడుతుందని తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషకాహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులమ్మ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో.తదితరులు పాల్గొన్నారు.