ప్రజల మధ్యే ఎమ్మెల్యే వివేకానంద్.. సంక్షేమమే పాలన లక్ష్యం
-పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే
-ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో భేటీ
-పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు స్వీకరించిన బీఆర్ఎస్ ఎల్పీ విప్
-నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై హామీ
పేట్ బషీరాబాద్, జులై 6 ( నమస్తే భరత్): ప్రజా సంక్షేమమే పరమావధిగా, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సోమవారం 132–పేట్ బషీరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, కార్యకర్తలు, అభిమానులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ఎమ్మెల్యేకు పలు కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను అందజేయడంతో పాటు, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వినతిపత్రాలను సమర్పించారు. వాటిని స్వీకరించిన ఎమ్మెల్యే వివేకానంద్ సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో రోజూ ప్రజలతో మమేకమవుతూ వారి వినతులను స్వీకరించడం ద్వారా ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్న ఎమ్మెల్యే వివేకానంద్ తీరును పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు.