ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు చట్ పూజ కార్యక్రమానికి ఆహ్వానం
నమస్తే భరత్ గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: హైదర్షాకోట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 123వ డివిజన్ హైదర్షాకోట్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న చట్ పూజ కార్యక్రమానికి హాజరుకావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని ఉత్తర్నివాసియా సేవా సంఘం సభ్యులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిని కలిసి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర్నివాసియా సేవా సంఘం ప్రెసిడెంట్ ధీరజ్ వర్మ, సెక్రటరీ వినయ్ శర్మ, ట్రెజరర్ విజయ్ మిశ్రా, జాయింట్ సెక్రటరీ వింధ్యాచల్ మౌర్యతో పాటు స్థానిక నాయకులు హరీష్ గౌడ్ పాల్గొన్నారు.