NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 10:02 pm Posted by : NAMASTHE BHARAT

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలతో నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలతో నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

➤ అర్హులందరూ ముఖ్యమంత్రి సహాయనిధి సదుపాయాన్ని వినియోగించుకోవాలి

➤ ఐదుగురు లబ్ధిదారులకు రూ.11.95 లక్షల విలువైన ఎల్ఓసీల పంపిణీ

➤ జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, మల్లంపేట్ వాసులకు మంజూరు

➤ చింతల్‌లోని బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో కార్యక్రమం

➤ నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యం

➤ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఎల్ఓసీ పత్రాలను బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గురువారం చింతల్‌లోని బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయంలో బి ఆర్ ఎస్ నాయకులచే లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎంఆర్ఎఫ్ సదుపాయాన్ని వినియోగించుకుని ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. ఈ విడతలో జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, మల్లంపేట్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.11.95 లక్షల విలువైన ఎల్ఓసీలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగన్, యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, దేవరకొండ శ్రీనివాస్, వేణు యాదవ్, సత్తిరెడ్డి, మల్లేష్ గౌడ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.