NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:42 pm Posted by : NAMASTHE BHARAT

అభయాంజనేయ స్వామి–పోచమ్మ దేవస్థానాల నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుభాకాంక్షలు

అభయాంజనేయ స్వామి–పోచమ్మ దేవస్థానాల నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుభాకాంక్షలు

 

-పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కమిటీ సభ్యులు

 

-ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ

 

-128వ డివిజన్ ఎన్ఎల్‌బీ నగర్ దేవస్థాన కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం

 

-ఆలయ సేవలో సమిష్టిగా కృషి చేయాలని కమిటీకి సూచన

 

కుత్బుల్లాపూర్, జూలై 13 ( నమస్తే భరత్ ): 128వ డివిజన్ చింతల్ పరిధిలోని ఎన్ఎల్‌బీ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం మరియు పోచమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యులు సోమవారం పెట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆలయాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని, భక్తుల సహకారంతో దేవస్థానాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ వైస్ చైర్మన్ ఎం. బసవరాజ్, సలహాదారులు జేమ్స్, ఆకుల ప్రభాకర్ గుప్తా, అధ్యక్షుడు వేముల నాగరాజు గుప్తా, వైస్ ప్రెసిడెంట్ గుంజరి నరేష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. వెంకటేష్, జనరల్ సెక్రటరీ జి. కృష్ణ, ట్రెజరర్ వి. కిషోర్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.