మక్తల్–వనపర్తి బస్సు సర్వీసు ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

**మక్తల్–వనపర్తి బస్సు సర్వీసు ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి ** నమస్తే భరత్,, 19/8/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి వనపర్తికి వయా కురుమూర్తి మీదుగా వెళ్లే నూతన బస్సు సర్వీసును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు వనపర్తికి రాకపోకలు సాగించేందుకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు అనుకూలంగా ప్రజా రవాణా సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు....