**మక్తల్–వనపర్తి బస్సు సర్వీసు ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి **
నమస్తే భరత్,, 19/8/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ నుంచి వనపర్తికి వయా కురుమూర్తి మీదుగా వెళ్లే నూతన బస్సు సర్వీసును మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు వనపర్తికి రాకపోకలు సాగించేందుకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు అనుకూలంగా ప్రజా రవాణా సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆర్టీసీ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి శ్రీహరి తెలిపారు. కొత్త బస్సు సర్వీసు ప్రారంభం కావడంతో మక్తల్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.