NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:34 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య సేవలు – 250 మందికి పరీక్షలు, ఉచిత మందులు

మరిపెడ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్య సేవలు – 250 మందికి పరీక్షలు, ఉచిత మందులు

వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం ఇటుకల గడ్డ తండ గ్రామపంచాయతీ, ఎంజేపీటీబీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజీతో పాటు, కేజీబీవీ స్కూల్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.ఇటుకల గడ్డ తండ మరియు ఎంజేపీటీబీసీ కాలేజీ పరిధిలో 150 మందికి, అలాగే కేజీబీవీ స్కూల్‌లో 100 మంది విద్యార్థినులకు వైద్య బృందం సమగ్ర పరీక్షలు నిర్వహించింది. మొత్తం 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ.వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు, విద్యార్థినులు సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరాల్లో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, హెల్త్ సూపర్‌వైజర్ ఆచార్యులు, ఏఎన్‌ఎంలు శ్రీదేవి, నాగమణి మరియు ఆశా ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .