నల్ల పోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: కూన శ్రీశైలం గౌడ్

– చింతల్ సంజీవయ్య నగర్‌లో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా
– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
– ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కారం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); చింతల్ సంజీవయ్య నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయం 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్ల పోచమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయ్ గుప్తా, గడ్డం రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షురాలు స్వాతి రాజేందర్ రెడ్డి, యాదగిరి, పెంటయ్య ముదిరాజ్, సూరా రవీందర్ గౌడ్, విజయేందర్ గుప్తా, ఉమామహేశ్వర్, కృష్ణమ నాయుడు, ఉమేష్, జానయ్య, కృష్ణకుమార్, సీహెచ్ శ్రీనివాస్ గుప్తా, కిరణ్ యాదవ్, నాంపల్లి విజయ్, రాజు గుప్తా, రాజమౌళి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.