NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 8:32 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడతండా గ్రామపంచాయతీలకు రెవెన్యూ హోదా ఇవ్వాలి – అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి

మరిపెడతండా గ్రామపంచాయతీలకు రెవెన్యూ హోదా ఇవ్వాలి – అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య
సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

నూతనంగా ఏర్పడిన తండాల గ్రామపంచాయతీలకు రెవిన్యూ హోదా ఇచ్చి అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని సిపిఎం మహబూబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 11 మంగళవారం రోజున సిపిఎం బృందం చింతల గడ్డ తండాను సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధిలో వెనుకబడి ఉన్న తండాలను గ్రామపంచాయతీ లుగా గుర్తించాలని అనేక పోరాటాల ఫలితంగా గత రాష్ట్ర ప్రభుత్వం 3146 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది కానీ వాటికి రెవిన్యూ హోదా కల్పించకపోవడంతో పాటు అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయిస్తామన్న నిధులను ఇవ్వకపోవడంతో తండాలలో స్థానిక సమస్యలు సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ వ్యవస్థ పాఠశాల భవనాలు అంగన్వాడి కేంద్రాల భవనాలు ఆరోగ్య కేంద్రాలు పశు వైద్య శాలలు సరియైన వసతులు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో చిన్న చిన్న తండా ఆవాసాలు పదివేలకు పైగా గిరిజన తండాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నూతనంగా ఏర్పడిన తండాల గ్రామపంచాయతీలకు రెవిన్యూ హోదా కల్పించి ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ రెండున్నర ఏండ్లు గడిచిన హామీని.నిలబెట్టుకోలేకపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం తండాల గ్రామపంచాయతీలకు రెవిన్యూ హోదా ఇచ్చి ప్రత్యేక అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి మూడు వేల కోట్లు కేటాయించి తాండాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజనులందరినీ ఏకం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్నv నలబోలు లక్ష్మారెడ్డి పుల్లూరి క్రాంతి కుమార్ గిరిజన సంఘం నాయకులు బానోత్ జగదీష్ బాస్ నాయక్ భూక్య చంద్రు, ఆంగోత్ దోలి, బానోత్ బుల్లి, ఆమ్గోత్ మంత్యా నాయక్, హత్తి రామ్, లచ్చి, బుజ్జి,స్థానిక తదితరులు పాల్గొన్నారు