మరిపెడ ఎస్సై చేతుల మీదుగా ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ
నమస్తే భారత్ :-మరిపెడ
అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో శంషాబాద్‌లోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మరిపెడ మండల సైయి సతీష్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఫోటోగ్రాఫర్లను ఎక్స్‌పోకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన పరికరాలు, ఫోటోగ్రఫీకి సంబంధించిన వివిధ అంశాలను తెలుసుకునేందుకు ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో.ఎంతో.ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఫోటోగ్రాఫర్లు, ఫోటో స్టూడియో నిర్వాహకులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎక్స్‌పోను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్, మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఫక్రుద్దీన్, మాజీ అధ్యక్షులు వీరభద్ర లింగన్న, సీనియర్ ఫోటోగ్రాఫర్లు లక్ష్మీనారాయణ, మధు, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, ఫోటోగ్రాఫర్ సంఘాల సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.