NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 10:33 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలు

నమస్తే భారత్ :-మారిపేడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండా గ్రామపంచాయతీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తమ తండాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తాగునీటి కోసం బోర్ ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.
తాము స్వచ్ఛందంగా పార్టీ మారలేదని, తమపై ఒత్తిడి తెచ్చి ఇతర పార్టీలోకి వెళ్లే పరిస్థితి కల్పించారని వారు పేర్కొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమకు నమ్మకం ఉందని, తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.