కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా మండల అధ్యక్షులు సమ్మిగౌడ్.
కోరుకొండపల్లిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సమ్మిగౌడ్
రెండు భాదిత కుటుంబాలకు 150 కేజీల బియ్యం వితరణ.
సమ్మిగౌడ్ సేవలు అభినందనీయం.స్థానిక సర్పంచ్ బాలాజీ రెడ్డి,గ్రామ అధ్యక్షులు సట్ల శ్రీనివాస్.
నమస్తే భారత్ :-కేసముద్రం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మిగౌడ్ నిరూపిస్తున్నారు. గురువారం కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో ఇటీవల వేర్వేరు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించారు.
గ్రామానికి చెందిన గాదగోని కొమురయ్య కుటుంబ సభ్యులు హరీష్, విజయేందర్, రవిలతో పాటు పోలెపాక సాంబయ్య కుటుంబ సభ్యులు రేణుక, జైకుమార్, యశ్వంత్‌లను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇస్తూ, రెండు కుటుంబాలకు 75 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ యాసాడి బాలాజీ రెడ్డి, నాయకులు సట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటూ సమ్మిగౌడ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ మాట్లాడుతూ
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.మీ ఆపదలో నేను అండగా ఉంటానని తెలిపారు. అన్న అంటే మీ ముందుంటా అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసి మెడి ఉపెందర్,మాజీ సర్పంచ్ నాగెళ్లి శ్రీనివాస్,సామల నరసయ్య,భీరమ్ గోపాల్ రెడ్డి,ఉప సర్పంచ్,ఆర్ఎంపీ వెంకన్న, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు మరియు కార్యకర్తలు.తదితరులు పాల్గొన్నారు.