ఖానాపురంలో ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణి

ఖానాపురంలో ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణి ఖానాపురం ఆగష్టు17(నమస్తే భారత్ మల్లేష్ ) : ఖానాపురం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. మండల స్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు, సమస్యల పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజావాణి కార్యక్రమానికి 18 మంది మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 20 వినతులు అందగా, వాటిలో పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, గృహ నిర్మాణం, ఐసీడీఎస్...