సంగెం కాలువలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఖానాపురం అక్టోబర్ 30(నమస్తే భారత్) :
ఖానాపురం మండలంలోని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు (40) సంగెం కాలువలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య మంచే సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. గుగులోత్ రామ్మోహన్ తెలిపారు. మృతుడు బాలరాజుకు భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.