నిత్యం వివాదాల సుడి గుండం లో మాకుల క్షేత్రం మండి పడ్డ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్
నమస్తే భారత్:-మరిపెడ
మ్యారమా భవానీ ఆలయంలో ప్రభుత్వ నిధులు కాకుండా భక్తుల దగ్గర తీసుకున్న నిధుల స్వాహా చేసిన అర్చక బృందం ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిన కూడా విరాళాల లెక్కలు ప్రకటించని ఆలయ అధికారులు, త్వరిత గతిన ఆలయ భూమి దాతల పేర్లు, ఆలయ కట్టడం కు ప్రభుత్వ నిధులు కాకుండా భక్తుల దగ్గర తీసుకున్న నిధుల లెక్కలు ప్రకటించి శిల ఫలకాల మీద చెక్కించాలి అని లంబాడీల ఐక్య వేదిక ద్వారా డీ చేస్తున్నాము అని తెలియ చేశారు.ఆలయ అధికారి కి తెలియకుండా, ఎలాంటి రసీదులు ఇవ్వకుండా లక్షలు రూపాయలు వసూలు చేసిన అర్చకులను విధుల నుండి తొలగించాలి అని డిమాండ్ చేసారు.అర్చకుని పై మరో అర్చకుడు దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దాని పై జాదవ్ రమేష్ నాయక్ స్పందించారు.గాయత్రి ని గుంజి వేసి కుంకుమ మీద చల్లిన వైనం.వీళ్లకు క్షేత్రం పై ప్రేమ లేదు కేవలం భక్తుల ద్వారా వచ్చే డబ్బుల మీద నే ప్రేమ, హుండీ లో డబ్బులు వేపించకుండా పళ్ళెం లో డబ్బులు వేయించుకొని స్వాహా చేస్తున్నారు అని వీరికి ప్రోత్సహిస్తున్న ముఠా ఆగడాలను అడ్డుకోవాలని ఆలయ అధివారులకు కోరుతున్నాము అని తెలియ చేశారు.అర్చకుల తీరు పై భక్తుల అసహనం చేస్తున్నారు అని సుప్రసిద్ధ మాకుల భావసంగ్ మహారాజ్ మ్యారమా భవానీ ఆలయ క్షేత్రం అర్చకుల తీరుతో బ్రష్టు పడుతోంది అని జాదవ్ రమేష్ నాయక్ వాపోయారు.తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజన లంబాడీల కొంగు బంగారం గా నిలిచే మాకుల బావు సింగ్ బావా, మ్యారమా భవానీ ఆలయం దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేక ఆలయ నిర్వహణ లోప భూయిష్టంగా మారుతోంది ముఠా ఆగడాలకు అంతు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆలయ సమీపంలో గౌరవ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయం.చుట్టూ విడిచి పెట్టిన మూడు ఎకరాల భూమి లో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ఇక్కడ ఆలయం లో పని చేసి బదిలీ పై గుంజేడు ఆలయం లో ఈ ఓ గా పని చేసిన బిక్షమ చారి ఏసీబీ కి పట్టు బడ్డారు. ఎసిబి నిందితుడు ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన ఆలయ వేలం పాట లో గ్రామ పెద్దలు ఆరోపించారు అన్న విషయం అందరికీ తెలిసినదే అని జాదవ్ రమేష్ నాయక్ గుర్తు చేశారు.ఇలా నిత్యం వివాదాల మధ్య ఆలయ నిర్వహణ గందర గోళం గా మారుతోందనీ భక్తులు ఆరోపిస్తు మాకుల క్షేత్రం భావసంగ్ బావ మ్యారామా భవాని పేరు చేర్పు ఉద్యమ నాయకులకు ఫోన్ లలో సంప్రదిస్తున్నారు అని తెలియ చేశారు.ఇదిలా ఉండగా ఆలయ అర్చకుని బావ మరిది ఆదివారం మ్యారామా భవానీ ఆలయం లో విధులు నిర్వర్తిస్తుండ గా ఆయన పై భౌతిక దాడి కి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.ఆలయం లో జరుగుతున్న అవినీతి, వివాదాలు బయటకు పొక్కకుండా అర్చకులు జాగ్రత్తలు తీసుకుంటున్న ఓ మాఫియా ను పోషిస్తున్నరని జాదవ్ రమేష్ నాయక్ ఆరోపించారు