NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:46 pm Posted by : NAMASTHE BHARAT

మక్తల్ మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) ఏకగ్రీవ ఎన్నిక

మక్తల్ మండల నూతన ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) ఏకగ్రీవ ఎన్నిక

నమస్తే భరత్, రిపోర్టర్ లక్ష్మణ్,,,, 20/9/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ మండల ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) నూతన కమిటీని ఆదివారం సీనియర్ జర్నలిస్టులు, సలహాదారులు అంజన్ ప్రసాద్, దేవసూగూరు సురేందర్, మద్వార్ బాల్ రాజ్ (సాక్షి విలేకరి) ఆధ్వర్యంలో అత్యంత ప్రశాంతంగా మరియు పారదర్శకంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

నూతన కార్యవర్గ సభ్యులు:

అధ్యక్షులు: మామిళ్ల పృథ్వీరాజ్

ప్రధాన కార్యదర్శి: రాజు పెయింటర్

గౌరవ అధ్యక్షులు: ఎల్లారెడ్డి

ఉపాధ్యక్షులు: సురేష్ గౌడ్, రఘు

కోశాధికారి: గోవింద్

కార్యదర్శులు: ప్రదీప్, సి. సురేష్, కర్నె బాల్ రాజ్, హరిక్రిష్ణ

ఈసీ సభ్యులు: నూర్ పాషా, కార్తీక్, వెంకట్ రెడ్డి
సమాజంలో నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తున్న పాత్రికేయ సోదరులందరూ ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నూతన కమిటీ నిరంతరం శ్రమించాలని కోరుకుంటూ…

ప్రత్యేక అభినందనలు & శుభాకాంక్షలు.
నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి మరియు సమర్థులైన విలేకరులందరికీ హృదయపూర్వక పూర్వక శుభాకాంక్షలు, ఆర్థికాభివృద్ధి మరియు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇట్లు
వాకిటి అంజనేయులు ముదిరాజ్
జ్యోతిరావు పూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు.
బీఎస్పీ పార్టీ నారాయణపేట మాజీ జిల్లా అధ్యక్షులు.