NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:21 pm Posted by : NAMASTHE BHARAT

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని 

నమస్తే భారత్,
17/7/2026,, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని

కొల్పూర్ గ్రామంలో ప్రజలకు తాగు నీటి కష్టాలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి?కెవి నరసింహ కార్యదర్శి ని అడుగుతే వేరే కార్యదర్శి లతో బెదిరింపులు

కొల్పూర్ గ్రామం మగనూరు మండలం నారాయణ పేట జిల్లా లోని కొల్పూర్ గ్రామ పంచాయతీ లో గత మూడు రోజులుగా త్రాగే నీరు రాక పోవడం వలన శుక్రవారం ఉదయం 9:4 నిముషాలకు కెవి నరసింహ పంచాయతీ కార్యదర్శి అయినటువంటి భాస్కర్ కు ఫోన్ చేసి హలో సార్ కొల్పూర్ గ్రామ ప్రజలు గత మూడు రోజుల నుండి త్రాగే నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పడం జరిగింది అయితే కార్యదర్శి సర్పంచ్ కు చెప్పాలి కదా అన్నారు అయితే కెవి నరసింహ ఉండి మీరు కార్యదర్శి కదా మీకు చెప్పరాద అని అనడంతో కార్యదర్శి తిరకాసు మాటలు ఆడద్దు అన్నారు అయితే పంచాయతీ కార్యదర్శి కి కొల్పూర్ గ్రామ ప్రజల గత మూడు రోజులు నీటి సమస్య ఉంటే అది కార్యదర్శికి అనవసరం అయినా సమస్య లాగా కనబడుతుంది భాస్కర్ కాకుండ వారి బంధువు వేరే జీపీ కార్యదర్శి నుండి అనేక దుస్ప్రచారాలు చేయించడం అంటే నేటి నుండి తెలంగాణ రాష్ట్రములో ఉండే ఏ గ్రామ పంచాయతీ ప్రజలు అయినా సరే సమస్య ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శ లను అడగరాదు అని కొల్పూర్ గ్రామ పంచాయతీ ప్రజలు అంటున్నారు అయితే దీని పై పై అధికారులకు రెండు మార్లు ఫోన్ చేసిన లేపాక పోవడం మరో విడ్డురం ప్రజల కనీస చిన్న చిన్న నీటి సమస్యలు తీర్చక పోవడం ఏమిటి అని ప్రజలు ఆచార్య పోతున్నారు నేటికైనా కొల్పూర్ గ్రామ ప్రజలు వెంటనే నీటి కొరత తీర్చాలి అని కొల్పూర్ గ్రామస్తులు కోరుతున్నారు