NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:58 pm Posted by : NAMASTHE BHARAT

జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా 

జీవిత బీమా పాలసీ కుటుంబానికి ఆర్థిక భరోసా

ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటి జీఎం లక్ష్మణ్

ఖానాపురం జూలై2 (నమస్తే భారత్ ) :
జీవిత బీమా పాలసీ ఆపద సమయంలో కుటుంబానికి ఆర్థిక భరోసా అని ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటి జనరల్ మేనేజర్ లక్ష్మణ్ అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళావారిపేట శివారు భద్రుతండాకు చెందిన లావుడ్య రమేష్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నందు రూ. 21500 వార్షిక ప్రీమియంతో పాలసీ చేశాడు. గత కొద్ధి రోజులు క్రితం వడదెబ్బకు గురై రమేష్ మృతి చెందాడు.కాగా పాలసీ దారుడి నామిని యాకమ్మకు బీమా మొత్తం రూ 3,27,325 చెక్కును గురువారం అందించారు. ఈసందర్భంగా డిప్యూటి జీఎం లక్ష్మణ్ మాట్లాడుతూ జీవితబీమా అనేది ఒక సామజిక బాధ్యతగా సామాజిక అవసరంగా ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. పాలసీ చేయడం వల్ల ఆపద సమయంలో కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నారు. జీవిత బీమా అనేది కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే ఒక ముఖ్యమైన ఒప్పందం. దీని ప్రకారం, పాలసీదారుడు క్రమం తప్పకుండా కొంత ప్రీమియం చెల్లించాలి. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే, బీమా సంస్థ లబ్ధిదారులకు (నామినీకి) నిర్దిష్టమైన మొత్తాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో అన్ని వర్గాల వారికి అనుగుణంగా అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డీఎం వరప్రసాద్ , నర్సంపేట బ్రాంచ్ సీనియర్ మేనేజర్ యాదండ్ల రాజు,నెక్కొండ మేనేజర్ కుసుమ ప్రవీణ్ ,జాకీర్ డి.ఓ వెంకటరమణ , బి.మల్లేష్ , సంస్థ ఉద్యోగులు ,గ్రామ సర్పంచ్ వీరన్న, మాజీ జెడ్పిటీసీ బాలు నాయక్ , మాజీ ఎంపిటీసి పూల్ సింగ్ , మాజీ సర్పంచ్ వెంకన్న ,పంచాయతీ కార్యదర్శి సంశోద్దీన్ గ్రామస్థులు పాల్గొన్నారు.