NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:28 pm Posted by : NAMASTHE BHARAT

గ్రామ దేవత ఆశీస్సులతో ముందుకు సాగుదాం

గ్రామ దేవత ఆశీస్సులతో ముందుకు సాగుదాం

*బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్*

*దూసకల్ గ్రామంలో భక్తిశ్రద్ధల మధ్య శ్రీ గడ్డ మైసమ్మ దేవాలయ పునః ప్రతిష్ట మహోతసంస్కృత*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్30:ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో బాగం కృష్ణయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గడ్డ మైసమ్మ దేవాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వై. రవీందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ దేవతల ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, భక్తి భావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ నిర్మాణం, పునః ప్రతిష్ట కోసం కృషి చేసిన బాగం కృష్ణయ్య యాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించి, గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు భాగం కుమార్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు చాట్ల రమేష్, పాపయ్య యాదవ్, బాలు, కావలి అశోక్ యాదవ్, శివ కుమార్, కె. విష్ణు, కుమ్మరి రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, బి. నర్సింలు, మల్లెల రవి, శంకరయ్య యాదవ్, శివ, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.