ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును పరామర్శించిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్

-ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన ఎమ్మెల్సీ
-శంభీపూర్ నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ చైర్మన్
-త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన బండ ప్రకాష్ ముదిరాజ్
-పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు
కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ): ఇటీవల వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి రిజర్వాయర్ పర్యటనకు వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ ముదిరాజ్ శనివారం శంభీపూర్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ప్రజాసేవలో మునుపటిలాగే చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ భేటీలో ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అనంతరం పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.