మంచే బాలరాజుకు ఘన నివాళులర్పించిన నాయకులు
ఖానాపురం నవంబర్ 10( నమస్తే భారత్) :
ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు ఇటీవల మృతి చెందగా, ఆయన దశదిన కర్మ కార్యక్రమానికి మార్కెట్ వైస్ చైర్మన్ , ఖానాపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు , సొసైటీ చైర్మన్ వల్లె శ్రీనివాస్ యాదవ్ ,కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా బాలరాజు మృతి పట్ల వారు విచారం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఖానాపురం సొసైటీ డైరెక్టర్లు శివరాత్రి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్రీను, మండల పార్టీ సహాయ కార్యదర్శి మేకల వరదయ్య, మనుబోతులగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్.కె. కమాలుద్దీన్,పిలిగిల్ల నాగరాజు యాదవ్, వార్డు సభ్యుడు ఆబోతు రవికుమార్ యాదవ్, మనుబోతులగడ్డ మాజీ సర్పంచ్ భూక్య నరసింహ నాయక్ , పోలు శ్రీను, కుంచం వెంకన్న, ఎండి మహబూబ్ పాషా, ఓర్సు సంపత్, శివరాత్రి యాకయ్య, ఎస్.కె. యాకూబ్ పాషా, వల్లెపు సాయిలు, ఎస్.కె. సైదులు, వల్లెపు నవీన్, వల్లెపు కృష్ణ, వేల్పుల కృష్ణ, బొంత శ్రీను, ఎస్.కె. కరీంపాషా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.