రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన లక్కవరం విద్యార్థినులు
జంగారెడ్డిగూడెం నమస్తే భారత్ నవంబరు 9 ప్రేమ్ కిరణ్
ఈ నెల 7వ తేదీన నారాయణపురంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ కోకో గేమ్స్‌లో పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ లక్కవరం విద్యార్థినులు మంచి ప్రతిభ కనబరిచారు. అండర్ 14 విభాగంలో జేరి అన్విత, దల్లి యామిని, అండర్ 17 విభాగంలో నిద్రబింగి ఈశ్వరి మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు కె. లక్ష్మణ్, డి. రాములను ప్రధానోపాధ్యాయుడు జి. దుర్గారావు, ఎస్‌ఎంసి చైర్మన్ దల్లి దుర్గారావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు