NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:47 pm Posted by : NAMASTHE BHARAT

ప్రత్యేక ఓటర్ల సవరణలో కూన శ్రీశైలం గౌడ్ భాగస్వామ్యం

ప్రత్యేక ఓటర్ల సవరణలో కూన శ్రీశైలం గౌడ్ భాగస్వామ్యం

-ఓటరు వివరాల నమోదు పత్రాన్ని అధికారులకు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

-ప్రతి ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పిలుపు

-ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని వ్యాఖ్య

-కుత్బుల్లాపూర్ ప్రజలు చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి

-గాజులరామారంలో స్వయంగా వివరాలు నమోదు చేసిన మాజీ ఎమ్మెల్యే

-సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు ప్రజల సహకారం అవసరమని సూచన

కుత్బుల్లాపూర్, జులై 30 ( నమస్తే భారత్ ); ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గురువారం తన స్వగ్రామమైన గాజులరామారంలో ఓటరు వివరాల నమోదు పత్రాన్ని స్వయంగా నింపి సంబంధిత స్థానిక ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదై ఉండేలా ప్రతి ఒక్కరూ తమ వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా ప్రజలందరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటరు వివరాలను నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమగ్రంగా, పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. స్వయంగా నమోదు పత్రాన్ని నింపి అధికారులకు అందజేయడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు.