NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:52 pm Posted by : NAMASTHE BHARAT

బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

దూలపల్లి డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ ఇంచార్జి

సమాజ సేవలో వారి కృషి చిరస్మరణీయమని కొనియాడిన హన్మంత్ రెడ్డి

కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు

కుత్బుల్లాపూర్, జులై 17 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 289 దూలపల్లి డివిజన్‌లో మాజీ సర్పంచ్, కొంపల్లి పీఏసీఎస్ (PACS) వ్యవస్థాపకులు, మాజీ చైర్మన్ కీ.శే. బుర్రా అగయ్య మరియు ఆయన సతీమణి కీ.శే. బుర్రా రుక్కమ్మ (లక్ష్మీదేవి) దంపతుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతులు సమాజాభివృద్ధి, సహకార రంగం, గ్రామాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, బుర్రా అగయ్య–రుక్కమ్మ దంపతులు ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసి గ్రామ ప్రజల మన్ననలు పొందారని, వారి సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ మహోత్సవంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని దంపతులకు ఘన నివాళులు అర్పించారు.