NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 3:09 pm Posted by : NAMASTHE BHARAT

దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.

దుర్గామాత సేవలో కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్.

అమ్మవారికి శరవన్నవరాత్రులకు 10 పట్టు చీరలు, భారీ గజమాల, నైవేద్యాల సమర్పణ

ధన్నసరి శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

నమస్తే భారత్ :-కేసముద్రం

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ ధన్నసరి 2వ డివిజన్‌ లో శ్రీ దుర్గామాత ఉత్చవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని మాత అమ్మవారికి 10 పట్టు చీరలు, భారీ గజమాల, నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నతనంలో ఆడుతూ, పాడుతూ పెరిగిన స్వగ్రామంపై తనకున్న మమకారాన్ని సమ్మయ్య గౌడ్ చాటుకున్నారు. జన్మభూమిలో గ్రామదేవతకు సేవ చేసుకునే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అమ్మవారి పూజ కు విచ్చేసిన భక్తులతో, పెద్దలతో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్ లో తను ఆడి, పాడి పెరిగిన గ్రామానికి తనవంతు సహాయం తను బ్రతికినంత కాలం ఉంటుందని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్చావాల సందర్బంగా అమ్మవారికి 10 రోజులకు పట్టు వస్త్రాలు పెట్టి సేవ చేసే గొప్ప అవకాశం రావడం, ఈ సందర్బంగా మన వాళ్లందరిని కలిసే అవకాశాన్ని కల్పించే అవకాశం కల్పించిన కౌన్సిలర్ దారావత్ కిషోర్ కి,కమిటీ అధ్యక్షులు సురేష్ మరియు ప్రతీ కమిటీ బాధ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ధారావత్ కిషోర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండా సురేష్, డైరెక్టర్ చి. యాదగిరి, ఉత్సవ కమిటీ సభ్యులు వేం అజిత్ రెడ్డి, వేం దిలీప్ రెడ్డి, అనుమునగంటి రాజు, కొసని శ్రీధర్ రెడ్డి, మర్రి నర్సింహా రెడ్డి, గోపాల మల్లారెడ్డి, పింగిలి మలయ్య, గాంతి మోహన్ రెడ్డి, గోపాల మన్మధ రెడ్డి, చింతనూర్ వెంకన్న, బంధరపు వెంకన్న,డా. వేణు గౌడ్,కొండా పాపారావు, కొండేటి సన్నీ, రేసు వెంకటేశ్వర్లు, కటకం శంకర్ లింగం, శీలం మునేష్, వేమూనూరి శ్రీను, గోపాల తిలక్, ఏనుగుల సుధీష్, రేసు సాయి, దుద్ధిమెట్ల రాజు, గ్రామ ఆడపడుచులు, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.