NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:23 pm Posted by : NAMASTHE BHARAT

జయశంకర్ ఆశయాల మార్గంలో కేసీఆర్..

*జయశంకర్ ఆశయాల మార్గంలో కేసీఆర్..*

*కేసీఆర్ అభివృద్ధితోనే జయశంకర్ ఆశయ సిద్ధి..*

*2028 తరువాత మళ్లీ మేమే..*

*జయశంకర్ ఆశయాలను సంపూర్ణం చేస్తాం..*

*షాద్ నగర్ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 06:తెలంగాణ ఉద్యమ సాధనతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తో కలిసి పోరాడిన కేసీఆర్ అనంతరం ఆయన ఆశయాల సాధన కోసం నిరంతర కృషి చేశారని షాద్ నగర్ బీఆర్ఎస్ సీనియర్నేత కేశంపేట మాజీ ఎమ్మెల్యే వై. రవీందర్ యాదవ్ అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక న్యూ సిటీ కాలనీలోని పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చోట్ల కేసీఆర్, జయశంకర్ కలిసి ముందుకు నడిచారని గుర్తు చేశారు. షాద్ నగర్ నియోజకవర్గానికి కూడా ఉద్యమంలో భాగంగా ఈ ఇద్దరు పలుమార్లు వచ్చారని అన్నారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధన ద్వారా ఏ అభివృద్ధిని కోరుకున్నారో అలాంటి అభివృద్ధిని ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు కేసీఆర్ బ్రహ్మాండంగా అందించారని అన్నారు. 2028 తర్వాత తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఆయన ఆశయాలను సంపూర్ణం చేస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్, సాగునీటి సమస్యలను తీర్చడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని అన్నారు. కేసీఆర్ తో పాటు ఉద్యమానికి వన్నెతెచ్చిన ఆచార్య జయశంకర్ సార్ ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆయన ఆశీస్సులు ఎప్పటికీ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సి ఎస్టీ కమీషన్ సభ్యులు రాంబాల్ నాయక్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మార్కెట్ చైర్మన్ మన్నె కవిత నారాయణ, మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, పార్టీ అధ్యక్షులు నటరాజన్, లక్ష్మణ్ నాయక్, కౌన్సిలర్లు వసంత శ్రీనివాస్, శారద శేఖర్, జయలక్ష్మి కిషోర్, గౌస్ జానీ, పిన్నమోని గోపాల్, ఎస్పీ శివ, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, జూపల్లి శంకర్, యుగంధర్, కానుగు అంతయ్య, శ్రీనివాస్ గౌడ్, నంద కిషోర్, చిన్న యాదగిరి, సర్పంచ్ జెట్ట కుమార్, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ పట్వారీ, నాయకులు నక్కల వెంకటేష్, బిక్షపతి, భాను శర్మ, నందిగామ శ్రీనివాస్, ప్రవీణ్, ప్రేమ్ కుమార్ గౌడ్, నవీన్, విష్ణు, రవీందర్, ఇర్ఫాన్, దొడ్డి రవీందర్, శేఖర్, రాఘవేందర్, గుండు అశోక్, కంది రాఘవేందర్, పవన్ సింగ్, పాండు, రామకృష్ణ రెడ్డి, వినోద్, చీపిరి సాయి, సిద్దు యాదవ్, అభిలాష్, వెంకటేష్, శీలం శ్రీకాంత్, రాజశేఖర్, సంజు నాయక్, శ్రీకాంత్, ప్రవీణ్, రఘు, నవీన్ గౌడ్, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.