గాగిల్లాపూర్ ఎక్స్‌రోడ్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ క్షేత్రస్థాయి పర్యటన

-స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలపై ఆరా
-రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యలపై వినతి
-అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్న హామీ
-ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాజీ సర్పంచ్ స్పష్టం
కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భారత్): 296వ డివిజన్ పరిధిలోని గాగిల్లాపూర్ ఎక్స్‌రోడ్ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ సోమవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో అంతరాయాలు, వీధి దీపాల కొరత, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు, అంతర్గత రహదారుల దుస్థితి, విద్యుత్ సంబంధిత సమస్యలు తదితర మౌలిక వసతుల లోపాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని కావలి గణేష్ హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ పర్యటనలో దొంతి మహేశ్ ముదిరాజ్, చెల్కల జీవన్ కుమార్‌తో పాటు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.