NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 11:58 am Posted by : NAMASTHE BHARAT

296వ డివిజన్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ విస్తృత పర్యటన

296వ డివిజన్‌లో ప్రజా సమస్యలపై కావలి గణేష్ విస్తృత పర్యటన

-ఎలూరు బస్తీ నుంచి మద్దూర్ బస్తీ వరకు స్థానికులతో ముఖాముఖి

-తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యలపై ప్రజల వినతి

-సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్న మాజీ సర్పంచ్

-ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ

దుండిగల్, జూలై 8 ( నమస్తే భరత్ ):
296వ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ విస్తృత పర్యటన నిర్వహించారు. దుండిగల్ గ్రామంలోని ఎలూరు బస్తీ, దాసరి బస్తీ, మార్కెట్ ఏరియా, మద్దూర్ బస్తీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాలో అంతరాయం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, రహదారుల దుస్థితి, వీధి దీపాల కొరత, పారిశుధ్య లోపాలు, దోమల నివారణ చర్యలు తగిన స్థాయిలో లేకపోవడం వంటి సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు తెలిపిన ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని కావలి గణేష్ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో వాపుల శ్రీనివాస్, దొంతి మహేష్ ముదిరాజ్, దత్తు రాజ్ యాదవ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజల సమస్యలను పరిశీలించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.