హైదరాబాద్‌లో జోయాలుక్కాస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం

– సినీనటి మాళవిక శర్మ చేతుల మీదుగా సుచిత్రలో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్ షో’ ప్రారంభం
– జూలై 3 నుంచి 19 వరకు ప్రత్యేక ఆఫర్లు.. ఆకట్టుకుంటున్న అత్యాధునిక డైమండ్ కలెక్షన్లు
పేట్ బషీరాబాద్, జూలై 3 ( నమస్తే భరత్ ): ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ హైదరాబాద్‌లోని సుచిత్ర బ్రాంచ్‌లో నిర్వహిస్తున్న ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెల్ షో’ను ప్రముఖ సినీనటి మాళవిక శర్మ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వినియోగదారులు, ఆభరణాల ప్రియులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. జూలై 3 నుంచి జూలై 19 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక డైమండ్ జ్యువెల్ షోలో దేశ, విదేశాల నుంచి ఎంపిక చేసిన అత్యాధునిక డైమండ్ ఆభరణాలను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ, నాణ్యత, విశ్వసనీయతకు జోయాలుక్కాస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వినూత్న డిజైన్లతో కూడిన డైమండ్ ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు. ఈ జ్యువెల్ షోలో ప్రత్యేక కలెక్షన్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక రాయితీలు కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రదర్శనలో డైమండ్ నెక్లెస్‌లు, రింగులు, చెవిపోగులు, బ్రేస్‌లెట్లు తదితర ఆధునిక డిజైన్ల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అరుదైన అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని జోయాలుక్కాస్ ప్రతినిధులు కోరారు.