*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*
*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి* *ఐజేయూ జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు సలీం పాషా* *ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి* *అక్రిడిటేషన్, బస్సు పాసులు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్లాట్లపై ప్రభుత్వానికి డిమాండ్* నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్02:టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి పీజీఆర్ పార్క్ ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐజేయూ రాష్ట్ర...