NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 11:21 pm Posted by : NAMASTHE BHARAT

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*

*జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి*

*ఐజేయూ జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు సలీం పాషా*

*ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి*

*అక్రిడిటేషన్, బస్సు పాసులు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్లాట్లపై ప్రభుత్వానికి డిమాండ్*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్02:టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని శేర్లింగంపల్లి పీజీఆర్ పార్క్ ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొండ విజయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం పాషా ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అక్రిడిటేషన్ కార్డులు, బస్సు పాసులు, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్టుల ప్లాట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. వివిధ నియోజకవర్గాలు, మండలాలకు చెందిన రిపోర్టర్లు తమ సమస్యలను ఐజేయూ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ జర్నలిస్టులో పాల్గొన్నారు.