కాలంతో పోటీకి జీడిమెట్ల పోలీసులు సిద్ధం

కంప్యూటర్ శిక్షణతో సాంకేతిక నైపుణ్యాల పెంపు
ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలే లక్ష్యం
ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకుంటున్న పోలీసులు
వ్యాక్సాన్ ఇంటర్నేషనల్ స్కూల్” సహకారానికి ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ కృతజ్ఞతలు
శిక్షణ పొందుతున్న పోలీసు సిబ్బందికి అభినందనలు
జీడిమెట్ల, జూన్ 18 ( నమస్తే భరత్ ): మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జీడిమెట్ల పోలీసు సిబ్బంది కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో పోలీసు వ్యవస్థలో కంప్యూటర్ పరిజ్ఞానం అత్యంత కీలకమని గుర్తించిన అధికారులు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం ద్వారా పోలీసు సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు శాఖాపరమైన పనులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కంప్యూటర్ శిక్షణలో పాల్గొంటున్న జీడిమెట్ల పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాగే పోలీసు సిబ్బందికి కంప్యూటర్ శిక్షణ అందించడంలో సహకరించిన వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి ఎస్‌హెచ్‌వో గడ్డం మల్లేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు శాఖకు విద్యాసంస్థలు అందిస్తున్న సహకారం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కాలంతో పోటీ పడేందుకు జీడిమెట్ల పోలీసులు తీసుకుంటున్న ఈ ముందడుగు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.