NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 8:06 pm Posted by : NAMASTHE BHARAT

కాలనీల సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర

కాలనీల సమస్యలపై కొలుకుల జగన్ పాదయాత్ర

-న్యూ రాజీవ్‌గాంధీనగర్, వాంబే కాలనీల్లో విస్తృత పర్యటన

-తాగునీటి పైప్‌లైన్ సమస్యలపై స్థానికుల నుంచి వినతులు

-భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల దుస్థితిపై ప్రత్యక్ష పరిశీలన

ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్

పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన నాయకులు, స్థానికులు

జగద్గిరిగుట్ట, జూలై 30 ( నమస్తే భారత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని న్యూ రాజీవ్‌గాంధీనగర్, వాంబే కాలనీల్లో నెలకొన్న తాగునీటి పైప్‌లైన్, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలపై మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. కాలనీలోని పలు వీధుల్లో పర్యటించిన ఆయన స్థానికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీసీ రోడ్ల లేమితో వర్షాకాలంలో రాకపోకలు మరింత కష్టంగా మారాయని స్థానికులు వివరించారు. అనంతరం కొలుకుల జగన్ మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి పైప్‌లైన్, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులను కోరారు. ఈ పాదయాత్రలో నాయకులు సాయిలు యాదవ్, రాకేష్, మురళి, రవి, బాలు నాయక్, ఆంజనేయులు, శ్రీశైలం, రమేష్, శ్రీను తదితరులు పాల్గొనగా, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు.