NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 11:04 am Posted by : NAMASTHE BHARAT

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం చేయడం కాంగ్రెస్ శ్రేణులందరి బాధ్యత: నర్సారెడ్డి భూపతిరెడ్డి

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విజయవంతం చేయడం కాంగ్రెస్ శ్రేణులందరి బాధ్యత: నర్సారెడ్డి భూపతిరెడ్డి

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలి

-అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలి

-బూత్ స్థాయి అధికారులతో పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచన

-ఓటర్లకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు.

-ఇంటి ఇంటికి వెళ్లి దరఖాస్తు పత్రాల సేకరణ, నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సూచన

-బౌరంపేట్ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకులు, బూత్ కోఆర్డినేటర్లతో ప్రత్యేక సమావేశం

 

కుత్బుల్లాపూర్, జూలై 20 ( నమస్తే భరత్);ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి బాధ్యత అని మాజీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్కల విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ సమన్వయకర్తలు, బూత్ సమన్వయకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రస్తుతం అత్యంత కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల నుంచి దరఖాస్తు పత్రాలు సేకరించి వాటి నమోదు పూర్తయ్యే వరకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గవ్యాప్తంగా అవగాహన సమావేశాలు నిర్వహించి, ఓటర్లకు అవసరమైన సహాయం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, అందువల్ల ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు నర్సారెడ్డి వీరారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సదానందం, నర్సారెడ్డి బాల్‌రెడ్డి, బేంబడి హనుమంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, శామీర్పేట్ ప్రకాశ్‌రావు, పోచి మహేష్, మన్నే కుమార్, యాదగిరి, సాల్మన్‌రాజు, పోచంపల్లి బాలరాజు, బైండ్ల దయానంద్, కోటేశ్వరరావు, మధులత రెడ్డి, షరీఫ్, రజియా, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.