NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:46 am Posted by : NAMASTHE BHARAT

న్యాయవాదుల దరఖాస్తులకు ఆహ్వానం

న్యాయవాదుల దరఖాస్తులకు ఆహ్వానం

2026–27 సంవత్సరానికి న్యాయశాస్త్ర శిక్షణ కోర్సు ప్రవేశాలు ప్రారంభం

మెద్చల్–మల్కాజిగిరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ప్రకటన

అర్హులైన బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

లా కోర్సులకు రూ.2 లక్షలు.. గ్రామీణ విద్యార్థులకు రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి

శిక్షణ కాలంలో నెలకు రూ.1,000 స్టైపెండ్, పుస్తకాలకు ప్రత్యేక భృతి

అడ్వకేట్‌ బాండ్లకు రూ.585, బార్ కౌన్సిల్ ఫీజుకు రూ.3 వేల ఆర్థిక సహాయం

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 13

కుత్బుల్లాపూర్, జులై 6 ( నమస్తే భారతం) : 2026–27 విద్యా సంవత్సరానికి న్యాయశాస్త్ర శిక్షణ (లా కోర్సు)లో ప్రవేశాల కోసం అర్హులైన బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుల వార్షిక కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించరాదని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.1,000 స్టైపెండ్‌తో పాటు అడ్వకేట్‌ బాండ్ల కొనుగోలుకు రూ.585, లా పుస్తకాల కొనుగోలుకు రూ.3 వేల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకునేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ గ్రాంట్ కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
అర్హతలు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 13 అని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన బీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.