అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026

అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – 2026 ఉపాధ్యాయుడు: నేటి తరగతి గదిలో రేపటి సమాజాన్ని నిర్మించే శిల్పి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు వారి ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాలను, విలువలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం.చరిత్రకు ఒకసారి వెనక్కి చూస్తే... అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం చరిత్ర 1966 అక్టోబర్ 5తో ముడిపడి ఉంది. ఆ రోజున పారిస్‌లో జరిగిన ప్రత్యేక అంతర్‌ప్రభుత్వ సమావేశంలో...